TVK Party : తమిళ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ చీఫ్ తళపతి విజయ్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇటీవల తన పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తోంది. సిట్ కూడా ఏర్పాటు అయింది. సిట్ ఈ కేసును దర్యాప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని, తమ పార్టీకి వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తోందని సుప్రీంలో విజయ్ సవాల్ చేశారు. నిజానికి సిట్ ను తమిళనాడు ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అస్రా గార్గ్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. అందులో ఉన్నవాళ్లంతా తమిళనాడు పోలీసు అధికారులే అని, అందుకే తమ పార్టీపై సిట్ పక్షపాత ధోరణి అవలంబిస్తోందని విజయ్ ఆరోపిస్తున్నారు.
మరోవైపు కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు, బాధితులను పరామర్శించేందుకు తనకు అనుమతి కావాలని విజయ్.. డీజీపీని కోరారు. ఇప్పటికే బాధితులతో వీడియో కాల్ లో విజయ్ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. త్వరలోనే బాధితులను, మృతుల కుటుంబాలను స్వయంగా కలవనున్నట్టు టీవీకే పార్టీ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
