Advertisement
tripti dimri supports Deepika Padukone

Deepika VS Tripti Dimri : దీపికకు జైకొట్టిన త్రిప్తి దిమ్రి.. శెభాష్ అంటున్న నెటిజన్లు

Deepika VS Tripti Dimri : ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే భేదం లేకుండా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉంది అంటే అది దీపికా పదుకొనె గురించే. తను బాలీవుడ్ బ్యూటీనే కానీ, టాలీవుడ్ లో కూడా తన గురించే చర్చ. దానికి కారణం పాన్ ఇండియా లేవల్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ముందు దీపికను తీసుకొని ఆ తర్వాత దీపికను తప్పించడమే.

Advertisement

కల్కీ సెకండ్ పార్ట్ లో తనను మూవీ యూనిట్ తప్పించింది. తన డిమాండ్స్ అందని ద్రాక్షలా ఉన్నాయని, తనను సెకండ్ పార్ట్ లో భరించలేమని మూవీ యూనిట్ చేతులెత్తేసింది. దానికంటే ముందు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీలోనూ అదే జరిగింది. తన గొంతెమ్మ కోరికలను తీర్చలేమని, తనను కాదని యానిమన్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని సెలెక్ట్ చేశారు. దీంతో త్రిప్తి దిమ్రి, దీపికా పదుకొనె మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనే వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Deepika VS Tripti Dimri : ఆ పోస్ట్ కు లైక్ కొట్టిన త్రిప్తి

సోషల్ మీడియాలో దీపిక గురించి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పోస్ట్ కు లైక్ కొట్టింది త్రిప్తి. రామ్ లీల సినిమాలోని ఓ పాట కోసం దీపిక చాలా కష్టపడ్డారని, చాలా బరువు ఉన్న లెహెంగా ధరించి డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డారని రాసుకొచ్చిన ఆ పోస్ట్ కు త్రిప్తి లైక్ కొట్టడంతో, వీళ్లిద్దరి మధ్య ఎలాంటి వైరం లేదని, దీపికకు త్రిప్తి మద్దతు ఇస్తోందని అటు దీపిక, ఇటు త్రిప్తి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement