WhatsApp
Advertisement

Cyclone Montha : మొంథా తుఫాను ఎఫెక్ట్.. ఆ రైళ్లన్నీ రద్దు చేసిన రైల్వే శాఖ

Cyclone Montha : ప్రస్తుతం మొంథా తుఫాను వల్ల ఏపీ మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ తుఫాన్ ధాటికి కోస్తా తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెళ్లే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. దాదాపుగా 107 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు మూడు రోజులు రైళ్లను క్యాన్సిల్ చేశారు. పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఏ రైళ్లు రద్దయ్యాయో వాటి వివరాలను రైల్వే శాఖకు సంబంధించిన వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు రైల్వే శాఖ సందేశాలను పంపించింది. అన్ని డివిజన్లకు సంబంధించిన రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది.

Advertisement