Advertisement

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో బయటపడ్డ లేఖ

మన పత్రిక, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో తన బ్యాచ్‌మేట్ అయిన ట్రైనీ మహిళా ఐపీఎస్‌తో తనకు గత ఏడాది కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంబంధానికి సంబంధించి తన వద్ద వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని ఉదయ్ అందులో వెల్లడించారు.

ఆస్పత్రిలో చికిత్స

కర్ణాటకకు చెందిన ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మోతీనగర్‌లోని తన బంధువుల ఇంటి వద్ద ఉదయ్ కృష్ణారెడ్డి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీనిని గమనించిన బంధువులు వెంటనే ఆయనను ఎస్‌ఆర్ నగర్‌లోని ఒక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement