మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: Toxic Director Geetu Mohandas: రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ (Toxic) టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే, యష్ లుక్ కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas). ఇంత వైల్డ్ టీజర్‌ను ఒక లేడీ డైరెక్టర్ కట్ చేశారంటే నమ్మలేకపోతున్నామని సాక్షాత్తు రామ్ గోపాల్ వర్మ (RGV) ట్వీట్ చేశారంటే ఆమె పనితనం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరీ గీతూ మోహన్ దాస్? ఆమె సినీ ప్రయాణం ఎలా సాగింది?
అసలు పేరు గాయత్రి.. మోహన్ లాల్‌తో అనుబంధం (Who Is Geetu Mohandas? Know Her Journey Into Acting and Direction:) గీతూ అసలు పేరు గాయత్రి. కేరళలోని కొచ్చిలో జన్మించిన ఆమె.. కేవలం నాలుగేళ్ల వయసులోనే ‘ఒన్ను ముట్టల్ పూజ్యం వరే’ అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లో ముద్దుగా పిలుచుకునే ‘గీతూ’ పేరే స్క్రీన్ నేమ్‌గా మారింది. విశేషమేమిటంటే.. ఆమె బాలనటిగా చేసిన మొదటి సినిమాకు, హీరోయిన్గా చేసిన మొదటి సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కు మోహన్ లాల్ (Mohanlal) కామన్ ఫ్యాక్టర్ కావడం. ‘అకలే’ (Akale) సినిమాలోని నటనకు ఆమెకు కేరళ స్టేట్ అవార్డు కూడా దక్కింది.
మొదటి సినిమాతోనే భర్తకు నేషనల్ అవార్డు 2009లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవిని (Rajeev Ravi) పెళ్లాడిన తర్వాత గీతూ నటనకు గుడ్ బై చెప్పి మెగాఫోన్ పట్టారు.
- లయర్స్ డైస్ (Liar’s Dice): ఆమె డైరెక్ట్ చేసిన ఈ తొలి హిందీ చిత్రానికి ఆమె భర్త రాజీవ్ రవికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు వచ్చింది.
- మూథోన్ (Moothon): అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.
- టాక్సిక్ (Toxic): ఇప్పుడు యష్‌తో పాన్ ఇండియా రేంజ్లో తన మూడో సినిమా చేస్తున్నారు. దీనికి కూడా ఆమె భర్తే సినిమాటోగ్రాఫర్ కావడం విశేషం.
ప్రస్తుతం ‘టాక్సిక్’ టీజర్‌లోని ఓ సన్నివేశంపై (మహిళ బెల్ట్ లాగడం) సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ నడుస్తున్నా.. ఒక మాస్ యాక్షన్ సినిమాను గీతూ హ్యాండిల్ చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
