మేషం:
పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వ్యాపారాలలో కొంత అభివృద్ధి సాధిస్తారు.
వృషభం:
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అంతంత మాత్రమే. ఆశించిన రీతిలో ధనం చేతికి అందదు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి కాలం అనుకూలం.
మిథునం:
చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. నూతన వస్తు సేకరణ చేపడతారు.
కర్కాటకం:
వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. నూతన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు.
సింహం:
ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కన్య:
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి.
తుల:
రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.
వృశ్చికం:
ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతానంనకు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్వల్ప ధన లాభం.
ధనుస్సు:
బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మకరం:
వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
కుంభం:
అనుకోని అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సోదరులను కలిసి ఆనందంగా గడపుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.
మీనం:
పనులు నిదానంగా సాగుతాయి. ఆనారోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. ఇంటాబయటా ఏర్పడిన చికాకులు తొలగుతాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
