భారతీయులకి బంగారం (Gold) పైన ఎంత మక్కువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండగైనా, పబ్బమైనా ఒక సగటు సామాన్య కుటుంబీకుడు కొనాలని భావించే మొదటి వస్తువు బంగారం. మూడేళ్ళ కిందటి వరకు ఓ మాదిరిగా మధ్యతరగతి వాళ్లకు అనుకూలంగానే ఉన్న బంగారం ఏడాదిన్నర కాలంగా పెరుగుతున్న తీరు చూస్తుంటే భారతీయులకి చుక్కలు కనబడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లలో ఆడపిల్లలకి బంగారు ఆభరణాల ముచ్చట చేయించలేక ఫ్యామిలీ మ్యాన్స్ ఎంతో ఇబ్బందిపడుతున్నారు.
నిన్నటికి నిన్న కూడా తులం బంగారంపై ఏకంగా 1500 పెరిగింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పది గ్రాముల బంగారం ధర (Gold rate) ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) లో 1,40,460 రూపాయలుగా ఉంది. నిన్నటికి 1,39,310 రూపాయలు ఉండగా దాదాపు 1150 రూపాయలు పెరిగింది. పది గ్రాముల బంగారంపై దాదాపు నెలరోజుల్లోనే పదివేల రూపాయలు పెరగడం గమనార్హం. దీంతో బంగారు ఆభరణాల సేల్స్ కూడా పడిపోయాయి. మళ్ళీ నార్మల్ రావాలంటే కనీసం లక్ష లోపలికి ధరలు దిగి రావాలి. ఆరోజు ఎప్పుడొస్తుందో తెలీదు గాని, దీనికి కారణమవుతున్న అమెరికా (America) గవర్నమేంట్ పై ఇండియన్ (Indian) గవర్నమేంట్ కూడా గట్టిగానే జవాబిస్తుంది.
