మన పత్రిక, వెబ్డెస్క్: మేష రాశి వారు ఈరోజు ప్రారంభించే పనుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బద్ధకాన్ని వదిలిపెట్టి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మేలు జరుగుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగాలి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ సందర్శనం శుభప్రదం.
వృషభ రాశి వారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్య ఆరాధన శుభప్రదం.
మిథున రాశి వారు వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంత సంపాదించినా ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. సూర్య, కుజ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి.
కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కటి శుభఫలితాలు కనిపిస్తున్నాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. దుర్గాదేవి నామస్మరణ మంచిది.
సింహ రాశి వారికి కాలం మిశ్రమంగా ఉంది. శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యవహారంలో తోటివారి నుంచి సహాయం అందుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. దుర్గా స్తోత్రం చదవడం వల్ల మేలు జరుగుతుంది.
కన్య రాశి వారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి, కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో శ్రమ ఉన్నప్పటికీ ఫలితం దక్కుతుంది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా కృషి చేయండి. సూర్యధ్యానం శుభప్రదం.
తుల రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. సకారాత్మక ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పనిలో విజయం వరిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి నుంచి సాయం అందుతుంది. శివారాధన శుభప్రదం.
వృశ్చిక రాశి వారికి కాలం ఎంతో శుభప్రదంగా ఉంది. ఏ పని చేసినా త్వరగా పూర్తవుతుంది. సమాజంలో పేరుప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్నది దక్కుతుంది. ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాలు మేలు చేస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. మీరు చేసే పనిలో దైవబలం సదా రక్షిస్తోంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కీలక సందర్భాల్లో తోటివారి సలహాలు మీకు మేలు చేస్తాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
మకర రాశి వారికి గ్రహబలం కాస్త తక్కువగా ఉంది. ఏ పని తలపెట్టినా అందులో నిబద్ధత, పట్టుదల అవసరం. పనుల్లో ఆలస్యం జరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఏకాగ్రతతో పనులు పూర్తి చేయండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణ చేయడం మంచిది.
కుంభ రాశి వారికి శుభాలు చేకూరుతాయి. మనోధైర్యం సర్వ ప్రధానం. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం మేలు చేస్తుంది. పట్టుదలతో పనిచేసి సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సూచనలు పాటించండి. నవగ్రహ ఆరాధన శ్రేయస్సును ఇస్తుంది.
మీన రాశి వారిని ఆత్మవిశ్వాసం సదా రక్షిస్తోంది. ఉద్యోగంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఈశ్వరధ్యానం శుభప్రదం.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
