టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ అవగా, అందులో మొదటిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన “రాజా సాబ్” (Rajasaab) రిలీజ్ అయింది. జనవరి 9న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. హారర్ & థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం క్రిటిక్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోకపోయినా, తొలిరోజు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర హంగామా చేసాడు రాజాసాబ్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టాడు.
ఇక రాజాసాబ్ విడుదలైన తొలిరోజు వరల్డ్ వైడ్ గా 102 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టింది. కాగా శని, ఆది వారాల్లో డే టైం లో వసూళ్లు తగ్గినా కూడా, ఈవినింగ్ నైట్ షోలకు హౌస్ ఫుల్స్ తో రచ్చ చేసాడు రాజాసాబ్. విడుదలైన మూడు రోజుల్లో రాజా సాబ్ అన్ని భాషల్లోనూ కలిపి 99 కోట్లకి పైగా షేర్ రాబట్టగా, 162 కోట్ల గ్రాస్ ని రాబట్టాడు. ఇక తొలివారం అయ్యేసరికి 220 నుండి 250 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే తాజాగా విడుదలైన చిరంజీవి (Chiranjeevi) “మన శంకర వర ప్రసాద్ గారు” (ManaShankaraVaraprasadGaru) సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో రాజాసాబ్ కి గట్టి కాంపిటేషన్ అయ్యే అవకాశం ఉంది.
అలాగే వరుసగా భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha mahashayulaku vignapti) , నారీనారీ నడుమ మురారి (NariNari Naduma murari), అనగనగా ఒక రాజు (Anaganaga oka Raju) వంటి మిడ్ రేంజ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్న నేపథ్యంలో రాజా సాబ్ కి కలెక్షన్లలో గండి పడే ఛాన్స్ ఉంది. మరి ఈ అన్ని సినిమాలని తట్టుకుని రాజాసాబ్ ఎంతవరకు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
