తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ( TGPSC Group 3 Certificate Verification Schedule 2025 ) . ఈ భర్తీకి సంబంధించి 1,388 పోస్టుల కోసం 2024 నవంబర్లో రాత పరీక్ష నిర్వహించారు. దీనిలో 2,67,921 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సాంకేతిక కారణాలతో 18,364 మందిని అనర్హులుగా ప్రకటించారు. మిగిలిన 2,49,557 మంది అభ్యర్థుల జీఆర్ఎల్ (Final Ranks List) మార్చి 14, 2025న వెల్లడించారు.
మొదట జూన్లో మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించాలని ప్రణాళిక ఉండగా, అభ్యర్థుల నుండి వచ్చిన వినతుల నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు. ప్రస్తుతం గ్రూప్ 2 తుది ఫలితాల ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించేందుకు TGPSC కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలోనే అధికారిక షెడ్యూల్ విడుదల కానుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
