Advertisement

తెలంగాణ టీజీ టెట్ ఫలితాలు విడుదల

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ టీజీ టెట్ (TG TET) జూన్ 2026 పరీక్షా ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విడుదల చేయనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/ ద్వారా తెలుసుకోవచ్చు. జూన్ 16 నుంచి జూన్ 22 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.

ఈ పరీక్షలో పేపర్-1 కోసం 50,113 మంది, పేపర్-2 కోసం 1,03,639 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కోసం ఫలితాల పత్రాన్ని ప్రింట్ తీసుకోవడం ఉత్తమం. నిర్ణీత సమయానికి అధికారిక పోర్టల్ అందుబాటులోకి రానుంది.

Advertisement
Advertisement