మన పత్రిక, వెబ్డెస్క్: టెట్ (TET) అర్హత ఉన్నప్పటికీ 6 నెలల బ్రిడ్జ్ కోర్సు ఎందుకు చేయాలన్న సందేహం చాలా మంది ఉపాధ్యాయుల్లో ఉంది. అయితే, సుప్రీం కోర్టు, ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఇవి రెండూ వేర్వేరు అంశాలు. టెట్ అనేది ఉద్యోగానికి కనీస అర్హత పరీక్ష మాత్రమేనని, అది వృత్తిపరమైన శిక్షణ (Professional Training) కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బీఈడీ (B.Ed) అర్హత ఉన్నవారు హైస్కూల్ బోధనకు శిక్షణ పొంది ఉంటారు. కానీ, వారు ప్రైమరీ టీచర్లుగా (1-5 తరగతులు) పనిచేస్తున్నప్పుడు, ఆ స్థాయి పిల్లల బోధనా పద్ధతుల్లో (Pedagogy) నైపుణ్యం కోసం బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి. 2023 నవంబర్ 28కి ముందు నియమితులైన వారికి ఈ కోర్సు రక్షణ కల్పిస్తుందని, టెట్ అర్హత ఉన్నా బ్రిడ్జ్ కోర్సు చేయడం అనివార్యమని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
