240 Crore Lottery : ఇది కదా అదృష్టం అంటే. ఎక్కడో వేరే దేశంలో మన తెలుగు యువకుడికి అదృష్టం పట్టుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.240 కోట్ల లాటరీ తగిలింది. యూఏఈలోని అబుదాబిలో ఉండే బోళ్ల అనిల్ కుమార్ వయసు 29 ఏళ్లు. అతడిది ఏపీనే. కానీ.. దుబాయ్ వెళ్లి అక్కడే ఉంటున్నాడు. లాటరీ టికెట్లు కొనడం అతడికి అలవాటు. అలా ఇటీవల తన తల్లి పుట్టిన రోజు తేదీని లాటరీ నెంబర్ గా ఉన్న టికెట్ ను సెలెక్ట్ చేసి తీసుకున్నాడు. కానీ, అదే తనకు అదృష్టం తీసుకొస్తుందని ఊహించలేకపోయాడు.
ఈనెల 18న తీసిన లక్కీ డ్రాలో భాగంగా అనిల్ కుమార్ ఏకంగా 100 మిలియన్ దిర్హామ్స్ లాటరీ గెలుచుకున్నాడు. అంటే మన కరెన్సీలో 240 కోట్ల రూపాయలు అన్నమాట. అదే లాటరీ టికెట్ ను మన ఇండియాలో గెలుచుకుంటే కనీసం 90 కోట్లు ప్రభుత్వానికి టాక్స్ రూపంలో చెల్లించాలి కానీ, యూఏఈలో అలాంటి టాక్స్ ఏం లేదు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

