Telangana 1500 RTC Conductor Jobs: శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కండక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని సంస్థ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో మొత్తం 3,208 కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, ప్రస్తుత తక్షణ అవసరాల రీత్యా వెంటనే 1500 పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ మేరకు 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ రవాణా శాఖ మంత్రి దృష్టికి ప్రతిపాదనలు తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, ఈ నియామక ప్రక్రియను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా చేపట్టే అవకాశం ఉంది.
కాగా, ఇప్పటికే సంస్థలో 10 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిన విషయం విధితమే. కండక్టర్ పోస్టులకు కూడా అనుమతి లభిస్తే, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
