TELANGANA LEAVE APPLICATION IN HRMS PORTAL : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఇంటర్మీడియట్ విద్యా శాఖ పరిధిలోని అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల సిబ్బంది లీవ్ కోసం HRMS పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
CL, EL, OH, EOL, HPL, మాతృత్వ సెలవు, పితృత్వ సెలవు, చైల్డ్ కేర్ లీవ్ సహా అన్ని రకాల సెలవులకు ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి. మాన్యువల్ అర్జీలు ఇకపై స్వీకరించబడవు. ఈ నిబంధనలు ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయాలు, నోడల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు, BIE & CIE సిబ్బంది, RJDIE, DIEO అధికారులతో పాటు రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ విద్యాసంస్థలకు వర్తిస్తాయి.
HRMS లీవ్ మాడ్యూల్ (ie-hrms.telangana.gov.in) ప్రారంభించారు. ప్రతి ఉద్యోగి లీవ్ బ్యాలెన్స్ ప్రిన్సిపాల్స్ డిజిటల్‌గా ఖచ్చితంగా నమోదు చేయాలి. ఒకసారి నమోదు చేసిన తర్వాత మార్పులు చేయలేరు. మొదటి లాగిన్ తర్వాత పాస్వర్డ్ మార్చుకోవాలి. లీవ్ మాడ్యూల్ యూజర్ మ్యాన్యువల్ చదవాలి. సాంకేతిక సమస్యలు ఉంటే HRMS సపోర్ట్ ఫారం ద్వారా స్క్రీన్షాట్లతో సమాచారం పంపాలి.
అధికారులు డేటా ఎంట్రీ పర్యవేక్షించి, ప్రిన్సిపాళ్లకు మార్గదర్శకం ఇవ్వాలి. పూర్తి నివేదికను డైరెక్టర్ కార్యాలయానికి సమర్పించాలి. త్వరలో LPC, NOCs వంటి ఇతర మాడ్యూల్స్ కూడా HRMS ద్వారా ప్రారంభించనున్నారు. అన్ని ఉద్యోగులు, అధికారులు ఈ ప్రకటనను తప్పనిసరిగా పాటించాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
