మన పత్రిక, వెబ్‌డెస్క్
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ ఆమోదం లేకుండా ఈ జీవో జారీ చేయడంపై న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది.
హైకోర్టు శనివారం దాదాపు గంటన్నర పాటు జీవో 9ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. బిల్లుకు గవర్నర్ ఆమోదం రాకముందే సబార్డినేట్ లెజిస్లేషన్ చేయడం చట్టబద్ధమేనా? అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే జీవో ఎందుకు జారీ చేశారు? అని కూడా నిలదీసింది.
ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే జీవో 9 అమలును నిలిపివేస్తామని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఏజీ స్పందించకపోవడంతో తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినా, పిటిషన్లపై విచారణ జరుపుతామని కోర్టు ప్రకటించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్లు రిజర్వేషన్లు 50% మించితే రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఇప్పుడు 67%కి చేరుతుందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
