తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో మూడు గంటల్లో భారీ వర్షం, ఈ జిల్లాలకు హెచ్చరిక!
మన పత్రిక, వెబ్డెస్క్: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు ( Cyclone in telangana ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం మరో మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
ముఖ్యంగా హైదరాబాద్, హనుమకొండ, జనగాం, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగా రెడ్డి, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వర్షం తగ్గే వరకు రైతులు వరి కోతలు కోయవద్దని జిల్లా కలెక్టర్లు సూచించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
