Telangana Bandh: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అసలు బీసీ కుల గణనను తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన చేపట్టింది. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రకటించిందో క్లారిటీ లేదని.. బీసీ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ లేక స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను కూడా హైకోర్టు రద్దు చేసింది. దీనిపై బీసీ సంఘాలతో పాటు పలు పార్టీలు కూడా భగ్గుమంటున్నాయి. ఈనేపథ్యంలో ఈనెల 18న తెలంగాణ బంద్ ను నిర్వహించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. దాని కోసం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను సంప్రదించగా.. ఆయా పార్టీలు కూడా తమ మద్దతును బీసీ సంఘాలకు తెలిపాయి.
బీజేపీ పార్టీకి, రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లోనే బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టేవారు.. చాయ్ తాగినంత సమయం పట్టదు బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం రావడానికి, కానీ వాళ్లు చేయరు.. అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు చాలా పదవులు ఇచ్చారని, అలాగే బీసీలు ఐక్యంగా పోరాడుతున్న ఈ ఉద్యమంలో కేసీఆర్ తన మద్దతును ప్రకటించాలని బీసీ నేత ఆర్.కృష్ణయ్య కోరారు. అలాగే, బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచంద్రరావు కూడా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

