Tech Mahindra హైదరాబాద్ లో మెగా వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 21 నుంచి 25 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో సర్వీస్ డెస్క్ – టెక్నికల్ సపోర్ట్ (ఇంటర్నేషనల్ వాయిస్) పోస్టులకు భారీగా నియామకాలు చేపడుతోంది. మొత్తం 100 ఖాళీలు ఉండగా, ఫ్రెషర్స్‌తో పాటు 1 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగానికి HSC, అండర్‌గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ అర్హులు. ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నైట్ షిఫ్ట్ (UK టైమింగ్)లో పని చేసే సామర్థ్యం తప్పనిసరి. రెగ్యులర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వారు అర్హులు కారు.
ఎంపికైన అభ్యర్థులు అంతర్జాతీయ కస్టమర్ల నుంచి వచ్చే కాల్స్‌ను హ్యాండిల్ చేయాలి. కస్టమర్ సమస్యలను సమర్థంగా పరిష్కరించడం, ఫస్ట్ కాల్ రిజల్యూషన్ అందించడం ప్రధాన బాధ్యతలు. వారానికి 5 రోజులు పని, 2 రోజులు రొటేషనల్ ఆఫ్స్ ఉంటాయి.
జీతం విషయానికి వస్తే, ఫ్రెషర్స్‌కు సుమారు ₹2.4 లక్షల నుంచి ₹4.5 లక్షల వరకు ప్యాకేజ్ ఉండగా, అనుభవం ఉన్నవారికి ₹5 లక్షల వరకు అవకాశం ఉంది. ఈ వాక్ఇన్ డ్రైవ్ హైదరాబాద్‌లోని బహదుర్పల్లి లోకేషన్లో జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
