Advertisement

అఖిలప్రియకు టీడీపీ అధిష్ఠానం తీవ్ర హెచ్చరిక

మన పత్రిక: ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని వివాదాలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పార్టీ, నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ముఖ్యంగా అహోబిలం తలనీలాల టెండర్ వ్యవహారంలో భార్గవ్ రామ్ జోక్యం చేసుకోవడంపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ క్రమశిక్షణను మీరితే కఠిన చర్యలు తప్పవని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేస్తూ ఎమ్మెల్యే అఖిలప్రియకు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

మరోవైపు నియోజకవర్గానికి చెందిన చిన్న చిన్న విషయాలను కూడా కొందరు సోషల్ మీడియా వేదికగా పెద్దవి చేసి చూపిస్తున్నారని, దీనివల్ల వివాదాలు మరింత పెరుగుతున్నాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement