Advertisement

అహోబిలం టెండర్ల వివాదం: ఎమ్మెల్యే అఖిలప్రియకు టీడీపీ అధిష్ఠానం పిలుపు

మన పత్రిక: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా అహోబిలం దేవస్థానం టెండర్ల వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రికి నేరుగా ఫిర్యాదులు అందడంతో పార్టీ నాయకత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది.

ఈ వివాదంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నుంచి వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఈ వ్యవహారాన్ని పరిష్కరించే బాధ్యతలను అప్పగించారు. ఇందులో భాగంగా బుధవారం ఎమ్మెల్యే అఖిలప్రియతో మాట్లాడాలని అధిష్ఠానం సూచించింది.

Advertisement
Advertisement