Advertisement
Tanuja vs Ritu in Bigg Boss Season 9

Bigg Boss Season 9 : ఈసారి తనూజ VS రీతూ..

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం మాధురి vs సంజన టీమ్ ల మధ్య టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో నిన్న మాధురి టీమ్ వాళ్ళు గెలవగా, బిగ్ బాస్ ఆ టీం కి రెండు వేలు ఇవ్వడం జరిగింది. అయితే మరోవైపు సంజన టీమ్ కోసం బిగ్ బాస్ పెట్టిన డబ్బుల్ని స్టోర్ రూమ్ నుంచి తనూజ మరియు సుమన్ కలిసి కొట్టేశారు. ఈ విషయంపై రీతూ తానూ సుమన్ (Suman shetty) అన్న తీస్తే చూశానని ఎవరితోనో చెప్తున్నట్టు తాజాగా ప్రోమో రిలీజ్ అయింది.

Advertisement

ఈ క్రమంలో డబ్బుల విషయంపై సంజన గొడవ చేస్తుండటంతో డబ్బులు ఇచ్చేద్దామా అంటూ సుమన్ అడగగా, గేమే దొంగతనం కదా.. నువ్వు ఇచ్చేస్తే ఏంటి యూస్ అంటూ తనూజ (Tanuja) సలహా ఇచ్చింది. అయితే ఈ విషయంపై కిచెన్‌ లో రీతూ తనూజకి మధ్య జరిగిన డిస్కషన్ లో రీతూ వాగ్వాదానికి దిగుతుంటే మళ్లీ మళ్లీ అరవకు రీతూ అంటూ తనూజ ఫైరయింది. దీంతో మాట మాట పెరిగింది. మాధురి తనుజాని పక్కకి తీసుకెళ్లి నిజంగా తీయలేదంటే ప్రామిస్ చేయమని అడగగా, ప్రామిస్ ఎందుకు చేయాలి గేమ్ విషయానికి అంటూ తనూజ చెప్పుకొచ్చింది.

Advertisement

ఫైనల్ గా ఈ విషయం మీద సంజన అందరితోనూ గొడవ పడుతుంటే దివ్య కూడా ఫైర్ అవుతూ మీరు చేస్తే ఫన్ మేము చేస్తే కంటెంట్ ఆ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ దొంగతనం టాస్క్ లో తనూజ ఎంత వరకు నెట్టుకొస్తుందో రాత్రి ఎపిసోడ్ లో చూడాలి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement