WhatsApp
Advertisement

Justice Suryakant : సుప్రీం నూతన చీఫ్ జస్టిస్‌గా సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం

Justice Suryakant : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఉన్న చీప్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ పదవీకాలం ముగిసింది. దీంతో నూతన చీఫ్ జస్టిస్‌గా సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ సూర్యకాంత్‌తో భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు.

కొత్త సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ ది హర్యానా. 1962లో ఆయన జన్మించారు. 1984 నుంచి ఆయన న్యాయవాద వృత్తితో ఉన్నారు. 2019 నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సుప్రీం చీఫ్ జస్టిస్ గా సూర్యకాంత్ కొనసాగనున్నారు.

Advertisement
Advertisement