Chevella Bus Accident : చేవెళ్ల రోడ్డు విస్తరణకు ఎందుకు ఆలస్యం అయింది? అని సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎందుకు ఎక్కించారు.. బస్సుల సంఖ్య ఎందుకు పెంచలేదు? అని ప్రశ్నించింది.
చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణ కోసం సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ హైదరాబాద్ చేరుకుంది. దర్యాప్తులో భాగంగా ఎన్‌హెచ్ఏఐ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, పోలీసులతో కమిటీ సభ్యులు సమావేశమైంది.
Advertisement
ఆర్టీసీ అద్దె బస్సులు ఎన్ని ఉన్నాయి? వాటి ఫిట్ నెస్ ఎంత? చేవెళ్ల వెళ్లే రూట్ ప్రధాన రహదారి అయినా ఎందుకు రోడ్డు విస్తరణ చేయలేదు? రద్దీకి అనుగుణంగా ఎందుకు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచలేదంటూ అధికారులపై కమిటీ సభ్యులు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
