Advertisement

హనీమూన్ హత్య కేసులో సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

హనీమూన్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆమె రాబోయే మూడు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది.

కోర్టు వ్యాఖ్యలు

సమాజంలో వస్తున్న మార్పుల వల్లే ఇటీవల ఇటువంటి దారుణాలు వెలుగుచూస్తున్నాయని విచారణ సమయంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. నేటి తరానికి పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం లేకపోవడంతో బలహీనంగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement