పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఎట్టకేలకు “ఓజి” (OG) సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే గాక ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత సంతృప్తినిచ్చిన సినిమా ఇచ్చాడు. డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కూడా పీకే ఫ్యాన్ కావడంతో తన అభిమాన హీరోని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపించి ఫుల్ మార్క్స్ కొట్టేసాడు.
ఇదిలా ఉండగా ఓజి నిర్మాత దానయ్య (Danayya)కి సుజీత్ కి కొంత కాలంగా మనస్పర్థలు వచ్చాయని నెట్టింట రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఓజి ఇతర భాషల ప్రమోషన్లని దానయ్య పట్టించుకోలేదని, రిలీజ్ తర్వాత కూడా సినిమాని గాలికొదిలేసాడని అది సుజీత్ కి నచ్చలేదని అందుకే మనస్పర్థలు వచ్చాయని వార్తలొచ్చాయి. అయితే మొత్తానికి వీటన్నిటికీ సుజీత్ చెక్ పెట్టాడు.
తాజాగా వేసిన ఓ లెటర్ ట్వీట్ లో ఓజీ చిత్రాన్ని నిర్మించేందుకు మూవీ యూనిట్ అందరూ చాలా కష్టపడ్డామని, ఈ విషయంలో తనకు అండగా నిలిచిన నిర్మాతలకు, యూనిట్ కి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని లెటర్ రిలీజ్ చేసాడు. దీంతో రూమర్స్ చెక్ పెట్టేసాడు సుజిత్. ఇక ఓజి సినిమా 300 కోట్లకి పైగా వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
