Advertisement

ఏప్రిల్ 7న వారణాసి విడుదల: ఎస్ఎస్ రాజమౌళి క్లారిటీ

మన పత్రిక, హైదరాబాద్: మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ విడుదల తేదీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ గురించి మాట్లాడే ముందు, వారణాసి సినిమా అప్‌డేట్ గురించి రాజమౌళిని అడిగారు. “వారణాసి చిత్రం ఏప్రిల్ 7న వస్తోందా?” అని ఎన్టీఆర్ నేరుగా ప్రశ్నించగా, రాజమౌళి “ఖచ్చితంగా” అని సమాధానమిచ్చారు. దీంతో వారణాసి సినిమా ఏప్రిల్ 7న విడుదలవుతుందని, అభిమానులంతా సిద్ధంగా ఉండాలని ఎన్టీఆర్ వేదికపై ప్రకటించారు.

Advertisement

పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి స్వయంగా విడుదల తేదీని ధ్రువీకరించడంతో ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు పూర్తి స్పష్టత వచ్చింది.

Advertisement