Advertisement

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి, రమా దంపతుల సరదా ఘట్టం

మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళికి సంబంధించిన ఒక సరదా సన్నివేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఘట్టం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి నటుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవ్వగా, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంలో రాజమౌళిని వేదికపైకి పిలిచిన సమయంలో, ఆయన వెనుక ఉన్న రమా రాజమౌళి వేగంగా ముందుకు వెళ్లాలంటూ సరదాగా నెట్టడం అక్కడి వారిని నవ్వించింది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. సెట్స్‌లో రాజమౌళి ఎంత పెద్ద దర్శకుడైనా, ఇంట్లో మాత్రం రమా రాజమౌళినే బాస్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

అక్టోబర్ 2న సినిమా విడుదల

శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించారు. బేబీ సారా, సౌరభ్ సచ్‌దేవ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తుండగా, ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Advertisement