Advertisement

శ్రీశైలం జలాశయానికి నేడు చేరనున్న కృష్ణా వరద నీరు

మన పత్రిక: కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి నేడు నీరు వచ్చి చేరనుంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలా మారాయి. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదను కిందకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టు నుంచి 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరు బుధవారం శ్రీశైలం జలాశయానికి చేరుకోనుంది.

ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 41 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో జలాశయంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ వరద రాకతో రాయలసీమ ప్రాంత రైతుల్లో పంట సాగుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Advertisement
Advertisement