మన పత్రిక: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) అధికారిణి Sonia Sehrawat చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ‘పార్లమెంట్ మార్చ్’ చేపట్టారు. ఈ నిరసనల సమయంలో భద్రతా బందోబస్తు విధుల్లో ఉన్న సోనియా సెహ్రావత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చనిపోయిన బొద్దింక ఫొటోను షేర్ చేశారు. తమను తాము సరిదిద్దుకోలేరు కానీ దేశాన్ని బాగుచేయాలని చూస్తున్నారంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ రాశారు.
ఈ పోస్ట్‌పై విద్యార్థులు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆమె దానిని తొలగించారు. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఎక్స్ వేదికగా స్పందిస్తూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని బొద్దింకలతో పోల్చడం దిగ్భ్రాంతికరమని పేర్కొంది.
సర్వీస్ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న అధికారులు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం, సీఆర్పీఎఫ్ లేదా ఆర్ఏఎఫ్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టడం నిషిద్ధం. అయితే సోనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో యూనిఫామ్ ఫొటోనే ప్రొఫైల్‌గా ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. హర్యానాకు చెందిన సోనియా సెహ్రావత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో జులై 24న విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
- భూపాలపల్లిలో గుట్కా నిల్వలపై సీసీఎస్ దాడి, భారీగా సరుకు స్వాధీనం
- ఢిల్లీలో నిరసనల్లో హింసపై స్పందించిన పోలీసులు: 118 మంది సిబ్బందికి గాయాలు
- కాంగ్రెస్ నిరసనలపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి తీవ్ర విమర్శలు
- ఓటీటీ ఆఫర్ల కోసం కష్టపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో
