WhatsApp
Advertisement

Banglore Crime : కోరిక తీర్చలేదని మహిళా టెక్కీ మర్డర్..

కోరిక తీర్చలేదని ఓ సాఫ్ట్వేర్ మహిళా టేకి ని ఓ ఇంటర్ విద్యార్థి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన కర్ణాటకలో బెంగళూర్ (Banglore) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న మంగళూరుకు చెందిన షర్మిల కుశాలప్ప (Sharmila kushalappa) (34). బెంగుళూర్ లో రామ్మూర్తినగర ఠాణా పరిధిలోని సుబ్రహ్మణ్య లేఅవుట్లోని ఓ ఫ్లాట్లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్న షర్మిల. అయితే
ఈనెల 3న షర్మిల ఒంటరిగా ఉన్నవేళ ఫ్లాట్లో ఆకస్మికంగా మంటలు చెలరేగగా, చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయగా, ఫ్లాట్ లో అప్పటికే ఆమె మరణించిందని పోలీసులు తేల్చారు. కానీ అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆమె మృతికి తగ్గ కారణాలను పోలీసులు తమ పద్దతిలో ఆరా తీసి దర్యాప్తు చేపట్టారు.

అయితే వైద్యులు తెలిపిన ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం షర్మిలది సాధారణ మరణం కాదని, ఆమె శరీరానికి నిప్పు అంటుకోకముందే చేతిపై గాయాలయ్యాయని, ఆ పైన ఊపిరాడక చనిపోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేల్చారు. దీంతో పోలీసులు అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించి, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఊహించని దారుణ నిజాలు బయటపడ్డాయి. అయితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం షర్మిల, ఆమె మిత్రుడు ఉండే ఫ్లాట్ పక్కనే కొడగు జిల్లా విరాజ్ పేటకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి కర్నల్ కురై (Karnal kurai) (18) తన తల్లితో కలిసి ఉంటున్నాడు.

Advertisement

అయితే ఈ నెల 3న షర్మిల స్నేహితుడు ఇంట్లో లేని సమయంలో కురై ఆమె ఉండే గదిలోకి కిటికీలోంచి దూరి, ఆమెను లైంగిక కొరిక తీర్చాలని ఒత్తిడి తేవడంతో గట్టిగా అరుస్తూ షర్మిల తోసేసింది. అప్పుడు కోపం పట్టలేని కర్నల్ కురై వంటగదిలోని కత్తితో ఆమెపై దాడి చేసాడు. అప్పుడు ఆమె పరుపుపై పడిపోగా, మరోసారి కొట్టి, అరవొద్దంటూ నోటిని దిండుతో గట్టిగా నోరు మూసాడు. దాంతో ఊపిరాడక షర్మిల చనిపోయింది. అయితే
ఆపై సాక్ష్యాలను నాశనం చేసేందుకు రక్తపు మరకలున్న ఆమె దుస్తుల్ని తీసి, అదే గదిలో నిప్పంటించి కాల్చేసాడు ఆ యువకుడు. మంటలు బెడ్ కి అంటుకుని మంటలు వ్యాపించడంతో కిటికీలోంచి దూకేసి పారిపోయాడు కర్నల్. అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే జైలుకి తరలించారు.

Advertisement