Advertisement
SI commits suicide by shooting himself in haryana

SI Suicide : పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో గన్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

SI Suicide : పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తన రివాల్వర్ తోనే కాల్చుకొని ఓ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. హర్యానాలోని సైబర్ డివిజన్ లో సందీప్ పని చేస్తున్నాడు. అయితే.. ఇటీవలే హర్యానాలోనే ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చేసుకున్న కొన్ని రోజులకే సందీప్ ఆత్మహత్య చేసుకోవడంతో హర్యానా పోలీస్ శాఖ ఉలిక్కిపడింది.

Advertisement

అయితే.. పూరన్ కుమార్ ఆత్మహత్య తర్వాత ఆయనపై అవినీతి ఆరోపణలు చేశాడు సందీప్. ఇటీవలే పూరన్ కుమార్ పై అవినీతి ఆరోపణలు చేసి, ఆ వెంటనే ఇలా సూసైడ్ చేసుకోవడం అనుమానాలకు దారి తీయడంతో వెంటనే సందీప్ ఆత్మహత్యపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement