మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మహానటి మొదలుకొని ఇప్పటివరకు నాలుగుకు పైగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించగా, తాను నటించిన మలయాళ సినిమాల్ని కూడా తెలుగులో డబ్ చేయడమే కాకుండా వాటికి కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. రీసెంట్ గా కాంత సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దుల్కర్, తాజాగా “ఆకాశంలో ఒక తార” అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే మూవీ లవర్స్ లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీని పవన్ సాదినేని డైరెక్ట్ చేస్తుండగా వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుట్టు సమాచారం.
ఇక ఇప్పటికే ఆకాశంలో ఒక తార సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అంచనాలను పెంచేయగా, ఈ మూవీ లో సాత్విక వీరవల్లి అనే కొత్త హీరోయిన్ దుల్కర్ సరసన నటిస్తుంది. కాగా ఈ మూవీలో సౌత్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు మేకర్స్ రివీల్ చేసారు. తాజాగా శ్రుతి హాసన్ బర్త్ డే సందర్బంగా తనకి విష్ చేస్తూ ఈ సినిమాలో ఫస్ట్ లుక్ ని రివీల్ చేసారు మేకర్స్.
ఇక రిలీజ్ చేసిన పోస్టర్ ని బట్టి ఈ మూవీలో శృతి హాసన్ ఒక బోల్డ్ రోల్ లో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. భారీ అంచనాలున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
