Advertisement

శంషాబాద్‌లో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

మన పత్రిక, శంషాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగినిపై ఆమె నిత్యం ప్రయాణించే క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విధులకు వెళ్తున్న క్రమంలో నిందితుడు వాహనాన్ని విమానాశ్రయ ఆవరణలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించి ఈ అఘాయిత్యానికి తెగబడ్డాడు. బాధితురాలు ధైర్యంగా ప్రతిఘటించడంతో నిందితుడు వాహనంతో సహా అక్కడి నుండి పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఎయిర్‌పోర్ట్ వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటనపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎయిర్‌పోర్ట్ అధికారులు అత్యవసర సమీక్ష నిర్వహించి, మహిళా ఉద్యోగుల రవాణా భద్రత కోసం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Advertisement
Advertisement