మన పత్రిక, వెబ్ డెస్క్ః మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క( minister seethakka) సూచించారు. శుక్రవారం ఆమె ములుగు జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా రూ.2.34 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy) మహిళలకు అండగా ఉంటున్నారని, చెక్ డ్యాముల నిర్మాణం వల్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, పశువులకు తాగునీరు లభిస్తుందని మంత్రి అన్నారు. గ్రామ పంచాయతీల్లో పింఛన్ల పంపిణీకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. 100 రోజుల EGS పనులు పూర్తిచేసిన కూలీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్, డీఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
