తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) ఈ మధ్య హీరోగా పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ అన్ని భాషల్లోనూ విలన్ గా, మంచి స్పెషల్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని పలకరిస్తున్నారు. అయితే అర్జున్ స్వీయ దర్శకత్వంలో, శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ‘సీతా పయనం’ (Seethapayanam) అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయి చాలా రోజులవుతున్నా సరైన రిలీజ్ డేట్ దొరక్క వాయిదా పడుతూ వస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు మేకర్స్.
సీతా పయనం సినిమాను “ప్రేమికుల రోజు” (ValentinesDay) కానుకగా ఈ ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya arjun) కథానాయికగా తెలుగు వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఇంతకు ముందు తమిళంలో పలు సినిమాలు చేసింది ఐశ్వర్య. ఇక సీతాపయనం లో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. అలాగే అర్జున్ దర్శకుడిగానే కాకుండా ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.
అలాగే అర్జున్ మేనల్లుడు కన్నడ స్టార్ ధ్రువ సర్జా (Dhruva sarja) గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనీ చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ నెలకొంది. తొందర్లోనే ట్రైలర్ రిలీజ్ చేసి థియేటర్లలో మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
