బిగ్ బాస్ 9 సీజన్లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఎంటర్టైన్మెంట్ డోసు కాస్త తగ్గిందన్న విషయం తెలిసిందే. అందుకే బిగ్ బాస్ ఈ వారం దొంగల ముఠా అంటూ టాస్క్ స్టార్ట్ చేసి హౌస్ మేట్స్ తో ఫన్ రాబట్టుకునే ప్రయత్నం చేసినా అది అంతగా పేలలేదు. అందుకే షో ని మరింత ఇంట్రెస్టింగ్ గా ఎలివేట్ చెసేందుకు కొత్త పథకం ఆలోచించారు బిగ్ బాస్.
ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ లో దొంగల ముఠా లీడర్స్ అయిన సంజన, మాధురి లను పట్టుకునేందుకు ఇద్దరు పోలీస్ లను హౌస్ బయటినుండి తీసుకొచ్చారు. వాళ్లెవరో కాదు గత సీజన్ 7 లో కంటెస్టెంట్స్ అయిన అమర్ దీప్ (Amar deep), అంబటి అర్జున్ (Ambanti arjun). ఏడో సీజన్లో ఇదే ఇలాంటి టాస్క్ లోనే వీళ్ళు పోలీస్ లు గా చేసిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు, అందుకే ఇప్పుడు షో ని మరింత ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళని తీసుకొచ్చారు.
హౌస్ లోకి ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన వీళ్ళిద్దరూ, హౌస్ లోని టాస్క్ మొత్తం ఆడించి వెళ్లపోతారని సమాచారం. మరి రాబోయే ఈ ఎపిసోడ్ ఎంత వరకు ఎంటర్టైనింగ్ గా ఉంటుందో చూడాలి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

