Advertisement

సాత్విక వీరవల్లికి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు

తెలుగు చిత్రసీమలో తన తొలి సినిమా విడుదల కాకుండానే యువ నటి సాత్విక వీరవల్లి గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రముఖ నటుల సినిమాల్లో వరుస అవకాశాలు పొందుతూ ఆమె టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

సాత్విక వీరవల్లి ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే నాగచైతన్యతో ఆమె చేయనున్న సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. వీటితో పాటు ధ్రువ్ విక్రమ్ నటించే ‘జాకీ’ అనే తమిళ చిత్రంలోనూ, సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ చేయనున్న ‘ఆర్‌సి 17’ ప్రాజెక్ట్‌లోనూ ఆమె నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement