టాలీవుడ్ లో తెరకెక్కబోయే మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో “స్పిరిట్” (Spirit) ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాపై ఇండస్ట్రీ లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఫ్యాన్స్ మరో వెయ్యి కోట్ల సినిమాగా దీన్ని చెప్పుకుంటున్నారు. అయితే ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవాపుడి సినిమాలు పూర్తయ్యాకే స్పిరిట్ సెట్స్ లో అడుగుపెడతాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ ట్రెండీ టాపిక్ వైరల్ అవుతుంది.
ఈ మధ్య కాలంలో పెద్దా చిన్న అనే తేడా లేకుండా సినిమా హిట్ అయితే చాలు సీక్వెల్ తీసేస్తున్నారు కొందరు దర్శకులు. బాహుబలి నుండి ఈ ట్రెండ్ ఊపందుకోగా, మొదట్లో పెద్ద సినిమాలకే ఈ స్ట్రాటజీని వాడగా, ఇప్పుడు సినిమాల సక్సెస్ రేంజ్ ని బట్టి అన్ని సినిమాలకు వాడుతున్నారు. అయితే ఇప్పుడు సందీప్ వంగ తీయబోయే స్పిరిట్ సినిమాకు రెండు పార్ట్ లు ఉండబోతున్నాయని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.
అయితే మామూలుగా ఒక సినిమాకే రెండు మూడేళ్ళ గ్యాప్ తీసుకునే సందీప్ వంగ స్పిరిట్ రెండు పార్ట్ లకి అంత సమయం ఇస్తాడో లేదో గాని, ముందుగా మొదటి పార్ట్ అయితే స్టార్ట్ చేయండి అంటూ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్పిరిట్ లో అనిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ఈ ప్రాజెక్ట్ నుండి ఏమైనా అనౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

