టాలీవుడ్ లో మాస్ బజ్ క్రియేట్ చేస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మరో హాట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ చర్చకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
మొదట Mrunal Thakur, తర్వాత Pooja Hegde, అలాగే Ayesha Khan, Manasa Varanasi పేర్లు వరుసగా వినిపించినా… మేకర్స్ మాత్రం సైలెంట్‌గా గేమ్ మార్చేశారు. చివరికి ఈ రేస్‌లో గెలిచింది మలయాళ స్టార్ Samyuktha Menon.
ఇప్పటికే ‘విరూపాక్ష’, ‘బింబిసార’ సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న సంయుక్త… ఇప్పుడు ఫస్ట్ టైమ్ పక్కా మాస్ స్పెషల్ సాంగ్‌తో రాబోతోంది. గోల్డెన్ లెగ్ ట్యాగ్‌తో ఉన్న ఈ బ్యూటీ ఎంట్రీ ‘పెద్ది’కి భారీ బూస్ట్ ఇవ్వనుందని ట్రేడ్ టాక్.
ఇక ఈ సాంగ్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ రెడీ చేశారట. కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కిస్తున్న ఈ పాట షూట్ త్వరలోనే స్టార్ట్ కానుంది. దర్శకుడు బుచ్చిబాబు సన… తన గురువు Sukumar స్టైల్లో ఈ సాంగ్‌ను సినిమాకే హైలైట్‌గా డిజైన్ చేస్తున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేయనున్నారట.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
