Samsung Galaxy M17 5G : సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి గెలాక్సీ ఎం17 5జీ ఫోన్ తాజాగా లాంచ్ అయింది. ఈ ఫోన్ సామ్ సంగ్ కంపెనీ వెబ్ సైట్, అమెజాన్ లో అందుబాటులోకి రానుంది. రెండు కలర్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో అత్యాధునికమైన ఫీచర్లు ఉన్నాయి. 50 ఎంపీ కెమెరా, ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7, 6.7 ఇంచ్ సూపర్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, 1100 నిట్స్ హెచ్‌బీఎం పీక్ బ్రైట్ నెస్, 1330 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
బేస్ వేరియంట్ అయిన సామ్ సంగ్ గెలాక్సీ ఎం17 5జీలో 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. 6 జీబీ ర్యామ్ ప్లస్ 8 జీబీ ర్యామ్ స్టోరేజ్ ఫోన్ల ధరలు రూ.13,999, రూ.15,499 గా ఉన్నాయి. ఈనెల 13 నుంచి ఫోన్ సెల్స్ ప్రారంభం కానున్నాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

