Samantha : ఐక్యరాజ్యసమితి తెలుసు కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు మరే ఇతర దేశంతో సమస్య ఉన్నా, ప్రపంచమంతా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలన్నా, ప్రపంచ ఖ్యాతి కోసం, ప్రపంచ మనుగడ కోసం ఏవైనా కార్యక్రమాలు ఉన్నా.. వాటన్నింటికీ ఇది వేదికలా పని చేస్తుంది.
ఇలాంటి సంస్థతో కలిసి టాలీవుడ్ హీరోయిన్ సమంత పనిచేయనుంది. దానికి కారణం ఏంటంటే.. ప్రస్తుతం ఆన్ లైన్ లో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి అందరికీ తెలిసిందే. ఆ వేధింపులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితితో కలిసి సమంత పని చేయనుంది.
యూఎన్ విమెన్ ఇండియా ద్వారా నిర్వహిస్తున్న నో ఎక్స్క్యూజ్ క్యాంపెయిన్ కు సమంత బ్రాండ్ అంబాసిడర్. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. దానికి సంబంధించి ఓ వీడియోను సమంత షేర్ చేసింది. మహిళలపై ఆన్ లైన్ లో నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్, ఫేక్ న్యూస్ లాంటివి రావడం వల్ల వాళ్లు చాలా ఇబ్బందులు పడతారు. ఆ బాధితురాళ్ల లిస్టులో తాను కూడా ఉన్నానని సమంత వెల్లడించింది. అందుకే ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని తనకు మద్దతు ఇవ్వాలని సమంత కోరింది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
