Advertisement
rtc bus and lorry accident at chevella

RTC Bus Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. బస్సులో 70 మంది

RTC Bus Accident : ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, రూల్స్ పాటించాలని నెత్తినోరు మొత్తుకున్నా రోడ్డు ప్రమాదాలు జరగడం మాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును, కంకర లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో చాలామందికి గాయాలయ్యాయి.

Advertisement

ఈ ఘటన చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ దగ్గర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో చేవెళ్ల, వికారాబాద్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement