Royal Enfield Himalayan 750 : మీరు బైక్ లవరా? బైక్ పై అడ్వెంచర్లు చేయడమంటే ఇష్టమా? కానీ, మీకు అడ్వెంచర్లు చేయడానికి తగ్గ బైక్ దొరకట్లేదా? రాయల్ ఎన్ఫీల్డ్, డ్యూక్, ఇతర స్పోర్ట్స్ బైక్స్ అన్నీ చూసినా వాటిలో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తోందా? అలాంటి వాళ్ల కోసమే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి అడ్వెంచర్ బైక్ ఒకటి రాబోతోంది. దాని పేరే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750.
ఈ బైక్ త్వరలో లాంచ్ కాబోతోంది. ఈ బైక్ ఫీచర్లు తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం. ఇటలీలోని మిలాన్ లో నవంబర్ 2025 లో జరగనున్న ఈఐసీఎంఏ 2025 ఈవెంట్ లో ఈ బైక్ ను లాంచ్ చేయనున్నారు.
ఇప్పటికే లాంచ్ అయిన హిమాలయన్ సిరీస్ కంటే కూడా పవర్ ఫుల్ టెక్నాలజీతో ఈ బైక్ లాంచ్ చేయబడుతోంది. ఇంజిన్ 750 సీసీ ప్యారలెల్ ట్విన్ ఇంజిన్, 648 సీసీ మోటర్, 50 హార్స్ పవర్, 60 ఎన్ఎమ్ టార్క్, యూఎస్డీ సస్పెన్షన్, డ్యుయల్ డిస్క్ సెటప్ బ్రేక్స్, టీఎఫ్టీ కన్సోల్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి, క్రూజ్ కంట్రోల్, త్రీ రైడ్ మోడ్స్ లాంటి ఫీచర్లతో రానుంది.
ఈ బైక్ భారత్ లో వచ్చే సంవత్సరం అంటే 2026 రెండో క్వార్టర్ లో లాంచ్ అయ్యే చాన్స్ ఉంది. భారత్ లో ఈ బైక్ ధర సుమారు 4 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు ఉండే చాన్స్ ఉంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

