WhatsApp
Advertisement

Reels on Police Vehicles : పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్.. క్షమాపణ చెప్పిన యువకుడు

Reels on Police Vehicles : నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు పోలీస్ వాహనంపై కూర్చొని ఇటీవల ఓ రీల్ చేశాడు. ఆ రీల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ రీల్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రీల్ చేసిన వాళ్ల పూర్తి వివరాలు తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.

ఆ తర్వాత ఆ రీల్ చేసిన యువకుడు అశోక్ గా పోలీసులు గుర్తించారు. తాను పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసి తప్పు చేశానని ఒప్పుకుంటూ క్షమాపణలు కోరాడు.

Advertisement
Advertisement