Advertisement
Raviteja Surendar reddy combo again

Tollywood : ఈ హ్యాట్రిక్ సెట్ అయితే కిక్కే కిక్కు

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి యమా క్రేజ్ ఉంటుంది. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా కొన్ని కాంబో ల గురించి ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇప్పుడలాంటి క్రేజీ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో గుసగుసలు నడుస్తున్నాయి. ఆ కలయికే మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) – సురేందర్ రెడ్డి (Surendar reddy) ల కాంబో.

Advertisement

వీళ్ళ కాంబోలో అంటే ముందు గుర్తొచ్చేది “కిక్” (Kick). రవితేజలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా ఎప్పుడు టీవీల్లో వచ్చినా టిఆర్పి బద్దలైపోద్ది. కానీ ఆ తర్వాత దీనికి సీక్వెల్ గా వచ్చిన కిక్2 అంతగా ఆడలేదు. దాంతో ఈ కాంబోకి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ పదేళ్ల తర్వాత ఈ వీళ్ళ కాంబో గురించి ఇండస్ట్రీలో రూమర్లు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే సురేందర్ రెడ్డి రవితేజ కి కథ వినిపించాడని, ఆ కథ కూడా రవితేజకి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలొస్తున్నాయి.

Advertisement

దీంతో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ వచ్చేసింది. ఇండస్ట్రీ లో కూడా ఈ కాంబినేషన్ సెట్ అయితే బ్లాక్ బస్టర్ కంఫర్మ్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి దీనిపై ఓ క్లారిటీకి రావాలంటే సురేందర్ రెడ్డి నుండి ఆఫీసియల్ గా అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement