Advertisement
raviteja mass jathara telugu trailer released

Mass Jathara Trailer : ఇది కదా కావాల్సింది.. రవితేజ మార్క్ ఎలిమెంట్స్‌తో మాస్ జాతర ట్రైలర్

Mass Jathara Trailer : రవితేజ అంటేనే ఒక ఎనర్జీ. ఆయన్ను సినిమాలో చూస్తున్నంతసేపు ఆడియెన్స్ కూడా ఎనర్జీ ఫీల్ అవుతారు. సినిమా మొత్తం ఆయన ఎనర్జీ లేవల్స్ పీక్స్ లో ఉంటాయి. అందుకే రవితేజ సినిమా అంటేనే మాస్, క్లాస్ అన్నీ కలిపి ఉంటాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మూవీ మాస్ జాతర.

Advertisement

ఈ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్, లిరికల్ సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈనెల అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో తన సత్తా ఏంటో చూపించాడు రవితేజ. తన ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్ ను మరోసారి వెండి తెరపై చూపించేందుకు రెడీ అయ్యాడు.

Advertisement

శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement