Advertisement

నెట్‌ఫ్లిక్స్‌లో రవితేజ ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్?

మన పత్రిక: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇరుముడి’ డిజిటల్ విడుదలపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ వేదిక నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తేదీపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుంచి కానీ, చిత్ర నిర్వాహకుల నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, సాయి కుమార్, బేబీ నక్షత్ర, స్వాసిక ముఖ్య పాత్రలు పోషించారు. సీలేరు ప్రాంతంలోని పోలూరు గ్రామానికి చెందిన త్రినాథ్ (రవితేజ) అనే సామాన్య రైతు, ట్రక్ ఆటో డ్రైవర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర) రక్షణే ధ్యేయంగా జీవించే త్రినాథ్, ప్రతి ఏటా కార్తీక మాసంలో 41 రోజుల పాటు అయ్యప్ప దీక్షను నిష్ఠతో పాటిస్తుంటాడు.

Advertisement

గ్రామంలోని తన గురుస్వామి (సాయి కుమార్) కుమార్తె గాయత్రి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆమె ఏమైంది, గ్రామాన్ని వేధిస్తున్న సమస్య ఏమిటనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement