కల
టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా (Raashi Khanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. Oohalu Gusagusalade సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తన పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. అయితే ఇప్పుడు పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా, Harish Shankar దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ Ustaad Bhagat Singhలో రాశీ ఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో Sreeleela ప్రధాన హీరోయిన్గా కనిపించనున్నారు.
తాజా ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయడం తనకు చాలా కాలంగా ఉన్న కల అని తెలిపింది. అంతేకాదు, ఆయనపై ఉన్న అభిమానంతోనే కథ కూడా వినకుండా ఈ సినిమాకు ఓకే చెప్పానని వెల్లడించింది. మొదటిసారి పవన్ కళ్యాణ్‌ను సెట్స్‌లో చూసినప్పుడు చాలా నర్వస్‌గా అనిపించిందని, డైలాగ్‌లు కూడా మర్చిపోయానని నవ్వుతూ చెప్పింది. అయితే కొన్ని రోజులు షూటింగ్ తర్వాత ఆయనతో చాలా ఫ్రీగా నటించగలిగానని తెలిపింది. పవన్ కళ్యాణ్ సెట్స్‌లో ఉంటే ఒక ప్రత్యేకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, ఆయనతో కలిసి డాన్స్ చేయడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పింది.
సినిమాకు సంగీతం అందిస్తున్న Devi Sri Prasad పాటలు మరో లెవల్లో ఉంటాయని కూడా రాశీ ఖన్నా చెప్పింది. మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమా అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా నిలుస్తుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి :
- Rajendraprasad : ఎం.జి.ఆర్ వివాదం: చివరికి సారీ చెప్పిన నట కిరీటి రాజేంద్రప్రసాద్!
- మంత్రి ఉత్తమ్.. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు
- నిజామాబాద్ గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా.. నలుగురు మృతి
- Miryalaguda: మిర్యాలగూడలో అధికారుల దాడులు.. 6 గ్యాస్ సిలిండర్ల సీజ్
- Ninnu Kori March 13 Episode: విరాట్‌కు సర్ప్రైజ్.. రాజ్‌కు శ్రుతి షాక్
