కోల్‌కతాలో జరిగిన దసరా వేడుకల్లో తాను మాట్లాడిన మాటలు పొరపాటుగా వచ్చాయని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ తెలిపారు. చెన్నైలో నిర్వహించిన రామాయణం సినిమా గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ మరియు పూర్తి ఆల్బమ్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ విషయంపై స్పందించి క్షమాపణలు చెప్పారు.
అసలు ఏం జరిగింది?
దసరా పండుగ ప్రాముఖ్యత గురించి కోల్‌కతా కార్యక్రమంలో వివరిస్తుండగా, చెడుపై మంచి సాధించే విజయం అని చెప్పడానికి బదులుగా మంచి ముగిసిపోతుందని పొరపాటున మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవ్వడంతో ఆయన చెన్నై వేదికగా వివరణ ఇచ్చారు. చెడు ఎంత శక్తివంతమైనదైనా చివరకు సత్యం, మంచితనమే గెలుస్తాయని చెప్పడమే తన ఉద్దేశమని రణ్‌బీర్ స్పష్టం చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
